కొత్త అనుభవం


కొత్తగా ఉంది ఈ రోజు
ఎక్కడ చూసినా సరికొత్త పలకరింపిలే

నన్ను ఎప్పుడూ నిద్రపోనివ్వకుండా  తన రాకను నాకు తెలిపే సూర్యుడు
ఈ రోజు మరికాస్త నిద్రపొమ్మని చిరుమందహాసంతో సెలవుతీసుకున్నాడు

సమయం కాకపోయినా  తన మధుర వాణితో  కోయిల వినిపించింది సుప్రభాతం
బయట అడుగు పెట్టగానే చిరుజల్లులతో  ననుతడిపేసింది ఆ మేఘం
చల్లని చిరుగాలి నా మేనిని తాకి నా ముఖాన చిరునవ్వు తెచ్చింది
మూగగా తనపనిలో ఉన్న చెట్లు  నన్ను చూడగానే ఆకులను ఇదిలించి పలకరించిందీ
 సరి  కొత్తగా..................................................