అమ్మ చెప్పింది

ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించింది శబ్దం
ఒక్కసారిగా నా గదిలో వెలిగిన బల్బు నా కనుల ముందున్న చీకటి ని వెలుతురుగా మార్చింది
అక్కడ చూస్తే వచ్చింది అమ్మ
నా  కంట కన్నీటిని తుడిచి అమ్మ వైపు చూసా
నా నుండి ఏమీ దయాల్చిన అవసరం లేదు నాన్న  అంటూ నా పక్కన కూర్చుంది అమ్మ
అంతే ఆ మాటకు నా మనసు చాటున దాగిన మౌన పోరాటం వీడిపోయింది
బిగ్గరగా ఏడ్చేసాను
నా మనసులోని బరువు తీరే వరకు
నా కన్నీరు రాలేక అలసిపోయేంత వరకు
అమ్మను గట్టిగా పట్టుకొని వొడిలో తలపెట్టి ఏడ్చేసా
ఇంతలో ఏదో నా చెక్కిలి తాకినట్టు అనిపించి చేతితో తడిమి చూస్తే నీటి బొట్టు అది
అమ్మను చూసా నా బాధ తన కంటినుండి బయటకి వస్తుందా అనిపించింది
లేచి ఆగని కన్నీటిని వెళ్లతో పక్కకి నెట్టి  అమ్మని చూసా
ఏమైంది నాన్న ఎందుకు ఎం జరిగింది అని అడిగింది అమ్మ
ఎందుకమ్మ ఈ జీవితంలో అందరూ పుడుతున్నారు,చస్తున్నారు ఈ మధ్య డబ్బు,పలుకుబడి,బందం,బందుత్వం,సంతోషం,భాద,ఇవన్ని ఎందుకు
పక్క వాడిని ఎం చేసైనా నేను బ్రతకాలి అనే ఆలోచన ఎందుకు
నేనే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను
ఇన్ని నవ్వు ముఖాల మధ్య నాకే ఎందుకు నవ్వడం అంత కష్టం అనిపిస్తుంది అని అడిగా అమ్మని
దానిని విని అమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది
అవును నాన్నా అందరు బ్రతుకుతున్నారు చివరికి జంతువులు కూడా  కానీ
వాటికి మనకు మధ్య ఒకే ఒక వ్యత్యాసం మనిషిలా బ్రతకటం
ఈ ఆటలో చివరికి నేను మనిషిని అలాగే ఇంతకాలం బ్రతికాను అని చూపించడమే
నీ జీవితానికి, నీ కధకి ఒక చివరి ఘట్టం  అని చెప్పింది అమ్మ
ఆ మాటతో రేపటి నా జీవితానికి ఒక దారి దొరికినట్టు అనిపించింది
అంతే అమ్మ వడిలో అలా తలవాల్చి పడుకున్నా