నా కనుల రంగు నీలిమేఘాన్ని కమ్మినపుడు
కారు మబ్బులు తాకిన ఆకాశం కోపంతో గర్జించినపుడు
చల్లని చిరుగాలి నా మేనిని తాకినపుడు
ఆ పులకింతల అలజడిలో నెమలి పూరివిప్పి ఆడినపుడు
వానజల్లు ఒక్కొక్కటిగా నా ముఖాన ముత్యపు చిరుజల్లుగా మారినపుడు
ఆ చిరుజల్లు కలయికతో నా మేని ముద్ధగా మారినాపుడు
నిన్నటి నా జీవితం రేపటి నా భవిష్యత్తు నా ముందుకు రాదు
ఆ క్షణం ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం