నీ అస్తిత్వం




ఏం  సాధించావని  ఆ  గర్వం     ఎందుకు  నీ  కళ్ళలో  ఆ  పొగరు

ఆశల  పూతోటను  పెంచిన  మాలి  కలల  పూమాలను  తెంచి మట్టి పాలు చేసినందుకా
కనుల నుండి జారే కన్నీటిని తుడుచుకొని రేపటి మీద ఆశతో ముందుకు నడిచే కాళ్ళని అవిటివాటిని చేసినందుకా

 ఎందుకు ఆ చూపు     ఎందుకు ఆ వెకిలినవ్వు

కడుపు నిండక పోయినా  అన్నానికి  బదులు  డబ్బు  తినగలిగే  అంత  ఆస్తి  వుందనా
అంతా నా చేతిలో ఉందని  అన్యాయం  అన్నవాడి  నోరు మూయించినందుకా

ఎందుకు   కనుబొమ్మలు  కలవని ఆ  చూపు

మానవత్వాన్ని  పారధ్రోలి అహంకారపు  అస్తిత్వాన్ని  ఏర్పర్చుకున్నావనా
నిన్ను నువ్వు తప్ప నీ  నీడను కూడా నమ్మని స్థాయికి  ఎదిగి పోయావానా

నీ అస్తిత్వానికి  ,డబ్బుకి మాత్రమే విలువ ఇచ్చేనువ్వు
ఎం సాదించవని   ఆ   చూపు