అమ్మతో ఒక మాట

వద్దు అంది అమ్మ
ఒప్పుకో అమ్మా అని గారంగా అడిగా నేను
వద్దు అర్ధరాత్రి మెలకువ వస్తే భయపడతావ్ అయినా బయటే పడుకుంటాను అంటే నీఇష్టం అంటూ ఆరుబయట మడతమంచం వేసింది
అటుగా వచ్చిన గాలి ఒక రహస్యాన్ని నా చెవిలో చెప్పింది "వర్షం వచ్చేటట్టు ఉంది నేను దానిని ఆపుతాను నువ్వు బయటనే పడుకో అని"
 అలా చెప్పిన నిమిషానికే గట్టిగా గాలి వీయడం మొదలుపెట్టింది
ఇంతలో మడత మంచం  వేసిన అమ్మ  పక్క వేయడం మరిచిందని గమనించిన మా పూల మొక్క
నా కోసం తన చెట్టుని విదిల్చి  తన  పూలను  నా మడతమంచం మీద దుప్పటిగా మార్చింది
అది చూస్తూ చిరుమందహాసంతో  నేను ఆ పూల పాన్పుపై తలవాల్ఛాను
 పైకి చూస్తే నల్లని ఆకాశంలో లెక్కపెట్టలేనన్ని తారలు వాటి గురువైన చంద్రుడితో అంత్యాక్షరి ఆడుతూ  కనిపించాయి
వాటితో ఆట మొదలు పెడుతున్న లోపే అక్కడికి వచ్చిన అమ్మ పక్కన కూర్చుని తలనిమురుతూ
ఇంకా ఎంతసేపు ఇప్పటికే ఆలస్యమైంది ఇంక పడుకో అంది
దాంతో కనుల ముందున్న అంత్యాక్షరీకి స్వస్తిచెప్పి
నా కలల లోక  ద్వారాన్ని తెరిచాను