నా పల్లెటూరు




నా పల్లెటూరు

ఇంటి ముందు ఒక  మంచినీటి  చెరువు
ఇంటి వెనుక  పచ్చని  పైరుతో  పొలాలు
నలుదిక్కులా  ప్రశాంత వాతావరణం
స్వచ్ఛమైన  గాలితో కనిపించిన ప్రతీ ఒక్కరినీ పలకరించే నా పల్లెటూరు

కౌలుపొలంలో   పంట పండించే వారు నాన్న
ధాన్యం తో  ఎప్పుడూ కళకళలాడుతూ  ఉండేది మా  గాదె
అనుకోని పరిస్థితుల వల్ల  అప్పులే మిగిలాయి చేతిలో
అయినా  నిరాశ చెందక  ఎదురొడ్డి పోరాడారు అమ్మా ,నాన్నా  పరిస్థితులతో

పరిస్థితులు అమ్మానాన్నల  సహనాన్ని కోరడంతో
చివరికి  పుట్టిపెరిగిన ఊరితో ఎడబాటుకు  సిద్దమయ్యామ్  అందరం
పెరట్లోని  పశువులని అమ్మవలసి వచ్చినపుడు అవి నాన్నని చూసిన చూపూ....
అవి  వెళ్ళిపోయేటపుడు నాన్న కళ్ళలో  కన్నీరు చూసానేను
 
ఎన్నో రోజులు గడిచాయి  ఇప్పుడు మేము ఆర్ధికంగా  నిలదొక్కుకున్నా
మేము ఊరు విడిచి వచ్చిన ఆ చివరి క్షణం  ఇప్పటికీ  కళ్లముందు  మెదులుతూనేవుంది
నా తల్లిదండ్రుల కళ్ళలో  ఊరిమీద మమకారం  ఇప్పటికీ  జీవించివుంది