చివరి మాట

బాధతో బరువెక్కిన మనసు
అందరూ వున్నా అనాదగా మిగిలిన  పయనం
వంటరిగా  బ్రతకలేక తన వారి కోసం వెతికే ఆ కళ్ళు
నేనున్నానంటూ చేయితట్టే వారు ఎవరూ మిగలలేని జీవితం
ఈ వింత జీవుల విచిత్ర మనసుల మధ్య  తన  అస్తిత్వం దుర్భరం
ఇక ఈ నాటక రంగంలో మనసు చంపుకుని తన పాత్రకు ప్రాణం పోయాలనే  ప్రయత్నం వ్యర్ధం
కోట్లమంది ప్రజలు బ్రతుకుతువున్నా  కూడా కలల మధ్య కన్నీటి బాటగా మారిన జీవితానికి తనిచ్చిన ఒక మిగింపు ............అంతం