నాతో ఒక ప్రశ్న


ఒక్కసారిగా ప్రశ్నల అలజడి
ఎందుకు ఈ ప్రయత్నం
ఎం  సాధించడానికి  నా  పయనం

మనిషిగా పుట్టినందుకా  ఈ  పరుగు........
లేక
రేపటి తరానికి నా గురించి తెలియాలనా

సమాజంలో నా స్థాయిని  నిలబెట్టుకోవడానికా
 లేక
 ఒక్క డబ్బు కోసమేనా

సాధించిన  దానితో  నా చావును  ఆపాలనా
లేక
పొగడ్తల వర్షంలో మరికొన్ని రోజులు బ్రతికేద్ధామనా

ప్రశాంత జీవితాన్ని గడపాలనా
లేక
కుళ్ళుకుట్రలు ,హింసల మధ్య కళ్ళు ఉన్నా అంధుడీలా ,మాటలు వచ్చినా మూగవాడిలా  బ్రతకాలనా

ఇన్ని జరుగుతున్నా  కూడా  మంచిని నమ్మాలి  అనే వారి మధ్య
అన్ని తెలిసివున్నా కూడా లోకంపోకడ అంతే అనుకుని  నా దారిలో జరిగే  వాటిని మాత్రమే  చూస్తూ నడవటానికా
ఎందుకు నా ఈ పయనం