ఎక్కడ చూసినా ఆనందపు చాయలు
నలువైపులా అభిమాన ఆలింగనాలు
ఈ యాంత్రిక జీవిత ప్రయాణంలో కొంత అలసటను ఇచ్చేవి పండుగలు
ఇంటి గుమ్మానికి మావిడాకులు
ఇంటి ముందు వేసే రంగ వల్లులు
ముఖాలపై చిరునవ్వులు
ప్రతీ రోజుకు భిన్నమైన అలంకారాలు
మన ఆలోచనల మలిన వాసన నుండి తాత్కాలిక విశ్రాంతి ఇస్తాయి
బరువు భాద్యతల మధ్య అలసిన బుజానికి కొంత అలసటను తీర్చుకునే సమయాన్నిస్తాయి