కమ్మని ఓ కల

కమ్మని  ఓ  కల
కనుల తలుపు తెరవగానే కనుమరుగైపొియింది
కల అయినా కలిగించే నాకది ఎంతో  ఆనందం

మనకు ఎవరూ తోడు ఉండలేని  సమయంలో  మనతో గడిపే ఒక నేస్తం
కను రెప్పలను దాటిన సమయంలో కనుమరుగైపోయే  ఒక  శ్రేయోభిలాషి
కల  దూరంతో సంబందం లేకుండా ఎక్కడికైనా తీసుకు వెళ్లే ఒక  వాహనం
మన మనసులోని ఆలోచనలకు  కల ఒక  చిరురూపం