చెమ్మగిల్లిన నా కళ్ళు

నిన్న నావైపు ఆదరణ కోసం చూసిన ఆ చేయి
ఈ రోజు నన్ను చూసి వెక్కిరిస్తుంది

ఒకరికి ఆనందాన్ని ఇవ్వాలని నేను చేసిన పయనం
చివరకు నాకు  అవమానాల బాటను మిగిల్చింది

ఒకప్పుడు నన్ను చూడగానే సంతోషంతో పలకరించే ఆ ముఖం
ఇప్పుడు నన్ను చూడగానే చిన్నబుచ్చుకుంటుంది

ఇన్ని జరిగుతున్నా
నన్ను అభినందనల వర్షంలో  ముంచెత్తే గొంతులు ఎన్నో
నన్ను చూసి ఆశీర్వదించే  చేతులూ  ఎన్నో....................