అన్నీ తెలిసినా ఆగనంటుంది ఈ ఆవేదన
నా నుండి నన్ను వేరుచేసే పయనం ఎందుకు?
నన్ను నేను అసహయురాలుని అనుకోవట్లేదు కానీ
ఎందుకో ఈ రోజు నా గొంతులోనే ఉంది నా దుఖం
నా మౌనం వెనుక దాగుని తొంగి చూస్తూనే ఉంది
కదిలిస్తే ఎప్పుడు కారిపోదామని
నిశి రాత్రిలో నేడు నా తోడు నడుస్తున్న ఆకాశం నన్ను గమనిస్తుంది
రోజు నవ్వుతూ పలకరించే దారి నేడు ఎన్నో ప్రశ్నలతో నన్ను చూస్తూ వుండిపోయింది
నా మౌనం మనుషులకు కొత్త కాదు గాని
నాతో నడిచే ఈ బాటసారులైన దారి , ఆకాశం , చెట్లకు కొత్త కధా మరి............