మరో రోజు నన్ను పలకరించింది

మరో రోజు నన్ను పలకరించింది
గొంతు దాటని ఎన్నో వూసులతో
మనసు చాటున దాగిన ఎన్నో మౌన భావాలతో
నిన్న కలగా మారాలని చిరు చిలిపి కోరికతో
రేపు ఎన్నటికీ రాకూడధనే విచిత్ర ఆలోచనతో
చిరునవ్వును నా గుప్పెట్లో దాచి వుంచాలనే పసి పలుకులతో
మరో రోజు నన్ను పలకరించింది